28-04-2025 05:42:12 PM
బడిబాటలో తంగెళ్లగూడెం గ్రామస్తులు...
పెన్ పహాడ్: ప్రైవేటు పాఠశాల మోజులో పడి ఆర్ధికంగా నష్టపోకుండా.. పిల్లల భవిష్యత్ ఆగం కాకుండా ఉండాలంటే మన సర్కారు బడిని మనమే అభివృద్ధి చేసుకుందామని పీఆర్ టీయూ రాష్ట్ర నాయకులు, ప్రధానోపాధ్యాయులు మేకల రాజశేఖర్ అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలంలోని తంగ్గెళ్లగూడెం ఎంపీపీఎస్ మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహించిన 'బడిబాట' కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గ్రామంలో ఉన్న విద్యార్థుల లిస్ట్ ప్రకారం హెచ్ఎం ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులతో సర్కార్ బడి ప్రాముఖ్యత.. ఉద్యోగ సమయంలో విద్యార్థులకు ఉపయోగపడే అంశాలపై వివరించారు.
దీంతో తల్లిదండ్రులు సర్కార్బడిని రూపుదిద్దుకుంటామని మనబడి మనమే రక్షించుకుందామని చేయి చేయి కలిపి గ్రామంలో బడిబాట కార్యక్రమంలో వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సహోపాధ్యాయురాలు మల్లేపల్లి ధనలక్ష్మి, మాజీ సర్పంచ్ బాధ ఈశ్వరమ్మా ధర్మయ్య, అంగన్వాడి టీచర్ కళావతి, తల్లిదండ్రులు రమణమ్మ, స్రవంతి సుజాత, కమలమ్మ, తదితరులు ఉన్నారు.