23-03-2025 06:45:13 PM
సిపిఐ పట్టణ కార్యదర్శి కామెర దుర్గరాజు..
మందమర్రి (విజయక్రాంతి): కామ్రేడ్ భగత్ సింగ్ స్ఫూర్తితో కార్పొరేట్ మతోన్మాదాన్ని పాతారేసేందుకు యువకులు, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఉద్యమించాలని భగత్ సింగ్, రాజ్ గురు, షుక్ దేవ్ ల అమరత్వం స్పూర్తితో యువకులు దేశంకోసం, దేశప్రజల బతుకులు మార్చడానికి కృషి చేయాలని సిపిఐ పట్టణ కార్యదర్శి కామెర దుర్గరాజ్, పట్టణ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆంథోనీ దినేష్ లు కోరారు. షహీద్ భగత్ సింగ్, రాజ్ గురు, షుక్ దేవ్ ల 94వ, వర్ధంతి సందర్బంగా పట్టణంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారి చిత్రపటాలకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... సామ్రాజ్యవాదులు భారతదేశాన్ని ఆర్థిక దోపిడికి గురి చేయడంతో పాటు రాజకీయంగా, సాంఘికంగా ప్రజల్ని నీవు దోపిడీ చేశారన్నారు. బాల్యం నుండే భగత్ సింగ్ విప్లవ స్ఫూర్తిని నింపుకొని తన నిండు జీవితాన్ని దేశం కోసం ఇచ్చిన గొప్ప త్యాగజీవి అని వారు అన్నారు.
నవ్వుతూ ఉరికంబమెక్కి ఈ దేశంలో విప్లవం విజయవంతం కావాలని నినదించిన ఉక్కు యువ నాయకులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ లని అన్నారు. నేడు యువత దేశంలో పెరిగిపోతున్న మతోన్మాదాన్ని, కార్పొరేట్ మతోన్మాదాన్ని బొంద పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం, పేదరికం విలయాతాండవం చేస్తుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కేవలం మతాన్ని అడ్డం పెట్టుకొని పాలన సాగిస్తుందని వారు విమర్శించారు. ప్రజలు ముఖ్యంగా యువకులు ఈ దేశం గురించి ఆలోచించి దేశభక్తియుత పోరాటాలతో ముందు నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి బండారి రాజేశం, అందుగుల పేట గ్రామ కార్యదర్శి తాళ్ల పెళ్లి వీరయ్య, సిపిఐ పట్టణ కార్యవర్గ సభ్యులు వెల్ది ప్రభాకర్, హేమచంద్ నర్సయ్యలు పాల్గొన్నారు.