06-04-2025 10:33:44 PM
ప్రజలను ఐక్యం చేస్తున్న శ్రీరామనవమి ఉత్సవాలు..
కొత్తగూడెం శాసనసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు..
కొత్తగూడెం (విజయక్రాంతి): అన్ని పండుగలు కలిసికట్టుగా జరుపుకొని మతసామరస్యాన్ని చాటడంతో పాటు భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కొత్తగూడెం శాసనసభ సభ్యులు, సిపిఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సూచించారు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఆదివారం చుంచుపల్లి మండల పరిధిలోని విద్యానగర్ లో జరిగిన సీతారాముల కళ్యాణ వేడుకల్లో పాల్గొని భక్తులు శుభాకాంక్షలు తెలిపారు. ఉత్సవ కమిటీలు ఏర్పాటు చేసిన పానకం పంపిణి, మహా అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ... ప్రతి ఒక్కరు సోదరభావంతో మెలగాలని, ఈర్ష్యాద్వేశాలకు దూరంగా ఉండాలని కోరారు.
నవమి ఉత్సవాలు ధనిక, పేద, కుల వర్ణ తారతమ్యం లేకుండా ప్రజలనందరని ఏకం చేశాయని ఈ సంప్రదాయాన్ని కొనసాగించి శాంతియుత సమాజాన్ని నిర్మించాలని ఆకాంక్షించారు. కులాలు మతాల పేరుతో, ప్రాంతాల పేరుతో బిజెపి, ఆర్ఆర్ఎస్, బజరంగ్ దళ్ లాంటి శక్తులు ప్రజల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ పబ్బం గడుపుకునేందుకు కుట్రలు చేస్తున్నాయని, ఈ శక్తులపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, నాయకులు వాసిరెడ్డి మురళి, చందర్ రావు తదితరులు పాల్గొన్నారు.