calender_icon.png 7 February, 2025 | 9:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చలో హైదరాబాదును జయప్రదం చేయండి

07-02-2025 07:09:54 PM

ఐ.ఎఫ్టియు రాష్ట్ర నేత డి ప్రసాద్..

టేకులపల్లి (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాక మునుపు కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఫిబ్రవరి 20న చలో హైదరాబాదును జయప్రదం చేయాలని కోరుతూ శుక్రవారం టేకులపల్లిలో ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ఊకే సురేష్ అధ్యక్షతన జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు డి ప్రసాద్ మాట్లాడుతూ..  అధికారంలోకి రాక మునుపు కాంగ్రెస్ పార్టీ కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని కోరుతూ ఫిబ్రవరి 20న చలో హైదరాబాదును జయప్రదం చేయాలని  కోరారు. హమాలి, సింగరేణి, మోటార్, అంగన్వాడి, ఆశ, మధ్యాహ్నభోజన, ఓబి తదితర కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని సింగరేణి కాంటాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని ఇంకా అనేక వాగ్దానాలు ఇచ్చిన కాంగ్రెస్ అధికారణంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కిందని అన్నారు. 

అదేవిధంగా ప్రజలకు 6 గ్యారెంటీలను వాగ్దానం చేసి 7వ వాగ్దానం ప్రజాస్వామ్యం పరిరక్షణ కాపాడుతానని అన్నారని కానీ నేడు ప్రజాస్వామ్యం పరిహాసం చేయబడుతుందని ఆయన అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు ఒక మాట అధికార లో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడడం  పాలక పార్టీలకు అలవాటైందని  అట్టి విషయాన్ని కార్మిక వర్గం అర్థం చేసుకొని ఉద్యమించాలని పిలుపునిచ్చారు.  అధికారం కోసం అనేక తప్పుడు వాగ్దానాలు ఇచ్చి గెలిచిన తర్వాత వాటిని విస్మరించడం పాలక పార్టీలకు అలవాటైందని దీనిని కార్మిక వర్గం అర్థం చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కార్మిక సమస్యల పరిష్కారం కొరకు ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతూ ఫిబ్రవరి 20న సంఘటిత. అసంఘటిత రంగ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు  జిల్లా నాయకులు బోడా  మంచ  జి ప్రసాద్. బి మహేష్. భరోత్  బన్సీ బి బాల. బి.బిచ్చు.బి . రవి, శ్రీరాములు, చిన్న, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు కత్తుల ఎర్రయ్య, మూడు బిచ్చు, సురేష్ తార్యా, లింగ తదితరులు పాల్గొన్నారు.