08-04-2025 09:04:06 PM
గజ్వేల్: గజ్వేల్ పట్టణంలోని శ్రీరామ బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయనున్నట్లు ఉత్సవ సన్నాహక కమిటీ తెలిపింది. ఈ మేరకు మంగళవారం సీతారామ ఉమామహేశ్వర ఆలయ బ్రహ్మోత్సవాల కమిటీ సమావేశం అయింది. ఉత్సవాల్లో భాగంగా కల్యాణోత్సవం రథోత్సవం నిత్యాన్నదానంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టడానికి నిర్ణయించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు కాల్వ శ్రీధర్ రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ లు ఎన్సీ రాజమౌళి గాడి పల్లి భాస్కర్, వేద పండితులు రాజశేఖర్ శర్మ, ఆలయ వంశపారంపర్య అర్చకులు శ్రీనివాసచార్యులు, మటం శివకుమార్ నంద బాలశర్మ, సన్నాహక కమిటీ సభ్యులు కొమురవెల్లి శంకరయ్య, బొగ్గుల సురేష్, కొన్ని రాజిరెడ్డి, నేతి చిన్న శ్రీనివాస్, నర్సింగరావు, జంగం రమేష్, బాల కుమార్ తదితరులు పాల్గొన్నారు.