23-04-2025 05:15:25 PM
బైంసా (విజయక్రాంతి): ఈనెల 30న అధికారికంగా నిర్వహించే మహాత్మా బసవేశ్వర్ జయంతితో పాటు వచ్చే నెల 2న బైంసా పట్టణంలో బసవేశ్వర జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుందామని సభ్యులు పిలుపునిచ్చారు. పట్టణంలోని నరసింహ కళ్యాణ మండపంలో బుధవారం మారుతీ పటేల్ అధ్యక్షతన లింగాయత్ సభ్యులు సమావేశం నిర్వహించారు. జయంతి ఉత్సవాలను విజయవంతం చేసేందుకు తీర్మానం చేశారు.
జయంతి ఉత్సవాల్లో ప్రతి మండల కేంద్రంలో నిర్వహించే ఉత్సవాల్లో లింగాయత్ సభ్యులు పాల్గొనాలని సూచించారు, వచ్చే నెల రెండున భైంసా పట్టణ కేంద్రంలో వీరశైవ లింగాయత్ సమాజం మాధురిలో జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని బసవేశ్వర విజయోత్సవ ర్యాలీని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పట్టణంలోని కడ్డ హోటల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని ఆయా వీధుల గుండా కొనసాగుతుందని అనంతరం బసవేశ్వర జయంతి ఉత్సవాలు, భజన సంకీర్తన కార్యక్రమం అన్నదానం వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు.