23-04-2025 05:40:07 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో బీసీ నాయకులంతా సమిష్టి కృషితో బీసీ సామాజిక స్ఫూర్తి దాతల విగ్రహాలను ఏర్పాటు చేసుకుందామని ఐక్యవేదిక నాయకులు తీర్మానం చేశారు. పట్టణంలోని పెన్షనర్ల భవనంలో బీసీ ఐక్యవేదిక సమావేశం నిర్వహించి నిర్మల్ జిల్లా కేంద్రంలో బీసీ భవన నిర్మాణంతో పాటు మహానీయులైన మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి విగ్రహాలను ఏర్పాటు చేయాల్సినందుకు కృషి చేయాలని పేర్కొన్నారు.
బీసీల్లో ఐక్యత సాధించి హక్కుల కోసం అందరం కూడా పోరాడాలని వారు పేర్కొన్నారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకోగా ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ గా ఎంసీ లింగన్న ప్రధాన కార్యదర్శిగా అమరవీని నర్సాపూర్ సహాయ కార్యదర్శిగా అనుముల భాస్కర్ కార్యనిర్వక అధ్యక్షుడిగా మనోజ్ యాదవ్ కోశాధికారిగా భూసారపు గంగాధర్ తో పాటు కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.