పాదముద్రలను గుర్తించిన అటవీ అధికారులు
భయాందోళనలో అటవీగ్రామాల ప్రజలు
బెల్లంపల్లి, డిసెంబర్ 3: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చర్లపల్లి అడవుల్లో చిరుత సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. గ్రామ సమీపంలోని అటవీప్రాంతంలో మంగళవారం చిరుతసంచరించినట్టు గ్రామస్థులు అధికారులకు సమాచారమిచ్చారు. ఆ ప్రాంతంలో పాదముద్రలను పరిశీలించి, అవి చిరుత అడుగులేనని తేల్చారు.
బెల్లంపల్లి ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ పూర్ణచందర్ సిబ్బందితో కలిసి చిరుత కదలికలపై ఆరా తీశారు. కొద్దిరోజులుగా ఈ ప్రాంతంలో చిరుత సంచా రం ఉందని, తాము బయటకు రావడానికీ భయపడుతున్నామని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా శంకరపల్లి పరిసరాల్లో పెద్దపులిని గుర్తించారు. అది మహారాష్ట్ర నుంచి పత్తి ఏరేందుకు వచ్చిన కూలీల కంటపడిందని తెలిసింది.