ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు
సిరిసిల్ల, జనవరి 24 (విజయక్రాంతి): చిరుత పులి సంచారం పట్ల చందుర్తి మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఐ, అంజయ్య అన్నారు. చందుర్తి మండల సరిహద్దు అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తుందని అటవీశాఖ అధికారులు ధ్రువీకరించిన నేపథ్యంలో రైతులు,గొర్రెల కాపరులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
కొడిమ్యాల నుండి చందుర్తి మండల అటవీ సరిహద్దులలో చిరుత పులి సంచరిస్తుందని రాత్రి సమయంలో పొలాల వద్దకు రైతులు వెళ్లకూడదని సూచించారు. అలాగే మధ్యాహ్నం సమయంలో కూడా ఒంటరిగా వెళ్లకూడదని పక్క పక్క పొలాల వారు చేతి కర్రలు సాయంతో పొలాల వద్దకు వెళ్లాలన్నారు.
రాత్రి సమయంలో పొలాల వద్ద ఎలాంటి విద్యుత్ కంచెలు ఏర్పాటు చేయకూడదని తెలిపారు.24 గంటలు చందుర్తి పోలీస్ స్టేషన్ నుండి డయల్ 100 కి సంబంధించిన పెట్రో కార్, బొలెరో వాహనాలు అందుబాటులో ఉంటాయి మీకు ఎలాంటి సమాచారం తెలిసిన డయల్ 100 కు ఫోన్ చేయాలని ఎస్సై అంజయ్య కోరారు.