భయాందోళనలో ప్రజలు
శేరిలింగంపల్లి, అక్టోబర్ 18: మియాపూర్‌లో చిరుత సంచరిస్తుందనే వార్త కలకలం సృష్టించింది. శుక్రవారం రాత్రి మియాపూర్ మెట్రో వెనకాల చిరుత కనిపించిందంటూ స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సీఐ క్రాంతికుమార్ సిబ్బంది తో కలిసి అక్కడకు చేరుకొని చిరుత ఆనవాళ్ల గురించి స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అటవీశాఖ అధికా రుల దృష్టికి తీసుకెళ్లి చిరుత ఆనవాళ్ల కోసం దగ్గరలోని సీసీ టీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కాగా, చిరుత సంచారం వార్తతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.