30-04-2025 12:48:55 AM
ఆర్మూర్, ఏప్రిల్ 2౯ (విజయక్రాంతి): ఆర్మూర్ పట్టణంలో ప్రసిద్ధిగాంచిన సిద్ధులగుట్టపై సోమవారం సాయంత్రం అకస్మా త్తుగా చిరుత పులి కనిపించి కలకలం సృస్థించింది. సాయంత్రం యువకులు సిద్ధులగు ట్టపైకి వెళ్లేందుకు రోడ్డు పక్కన ఉన్న నల్ల రాళ్ళపై కనిపించింది.
చిరుత కనిపించిన దృశ్యాలను యువకులు వీడియో తీశారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. నిత్యం గుట్టపై ఉన్న దేవాలయాలను వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ఈ క్రమం లో గుట్టపై చిరుత పులి కనిపించడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఫారెస్ట్ అధికారులు స్పందించి చిరుత పులిని పట్టుకోవాలని కోరుతున్నారు.