నిజామాబాద్, డిసెంబర్ 3 (విజయక్రాంతి): జాతీయ రహదారి దా టుతున్న చిరుతను వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఘటనలో చిరుత మృత్యువాతపడింది. తెలిసిన వివరాల ప్రకారం.. కామారెడ్డి కల్వరాల బీట్ పరిధిలోని 44 జాతీ య రహదారిపై మంగళవారం రాత్రి చిరుత నడుస్తూ వస్తున్నది. రోడ్డు దాటుతుండగా వేగంగా వస్తున్న కారు చిరుత ను ఢీకొట్టింది. ఘటనలో చిరుత గా యాల పాలై మృతిచెందని పారెస్ట్ అధికారులు తెలిపారు.