హైదరాబాద్: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం రంగారావుపేట శివారులోని ఫాంహౌస్ సమీపంలో చిరుతపులి(Leopard) కుక్కను చంపేసింది. సోమవారం ఉదయం కుక్క కళేబరాన్ని గుర్తించిన గ్రామస్థుడు రమేష్ అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సయ్యద్ సత్తార్ సంఘటనా స్థలాన్ని సందర్శించి పగ్ మార్కులను పరిశీలించారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యవసాయ క్షేత్రాలను(Agricultural fields) ఒంటరిగా సందర్శించవద్దని సూచించారు. ఈ ఘటనతో గ్రామంలో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. చిరుతను వెంటనే పట్టుకోవాలని గ్రామస్తులు అటవీశాఖ అధికారులను(Forest Department officials) కోరారు.