calender_icon.png 16 January, 2025 | 10:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిరిసిల్లలో గొర్రెల కాపరి, మేకలపై చిరుతపులి దాడి

07-08-2024 01:01:36 PM

గంభీరావుపేట: రాజన్నసిరిసిల జిల్లా గంభీరావుపేట మండలం గోరంటాల శివారులోని ఎద్దుగుట్ట అటవీ ప్రాంతంలో మంగళవారం రాత్రి గొర్రెల కాపరి, మేకల మందపై చిరుతపులి దాడి చేసింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పక్కనే ఉన్న అడవి నుంచి చిరుత పులి వచ్చి మందపై దాడి చేసింది. గొర్రెల కాపరి శ్రీనివాస్‌ తన వెంట ఉన్న గొడ్డలిని ఊపుతూ తప్పించుకున్నాడు. ఇంతలో చిరుత ఒక మేకతో అక్కడి నుంచి పారిపోయింది. చిరుత పులి దాడితో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. చిరుతను పట్టుకోవాలని అటవీశాఖ అధికారులు కోరారు.