13-04-2025 12:31:47 AM
చాలామంది తాము రోజూ తినే వంటకాల్లో పప్పును భాగం చేసుకుంటారు. మన పండుగల్లో, శుభకార్యాల్లో తప్పనిసరిగా పప్పు కూర ఉంటుంది. లేదా పప్పుతో చేసే సాంబార్ అయినా తప్పక ఉంటుంది.దీన్ని తినడం వల్ల మన ఆరోగ్యానికి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. పప్పులో ఉండే ఫైబర్లు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. రక్తహీనతను నివారిస్తాయి. గుండె ఆరోగ్యానికి, ఎముకల ఆరోగ్యానికి పప్పు మేలు చేస్తుంది. అయితే పప్పును ఎక్కువగా తీసుకుంటే కొన్ని దుష్పరిణామాలు కూడా ఉంటాయి. అవేంటో చూద్దాం..
* పప్పులో ప్యూరిన్లు ఉంటాయి. ఇవి శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచి కీళ్ల నొప్పులకు కారణం అవుతాయి. అందుకే పప్పును ఎక్కువగా తినకూడదు.
* పప్పులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మనకు మేలు చేసినప్పటికీ పప్పును అతిగా తీసుకుంటే కొన్నిసార్లు గ్యాస్, అసిడిటీ సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
* పప్పుల్లో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. దీన్ని అధికంగా ఆహారంలో చేర్చుకుంటే శరీరంలో కొవ్వు పెరగడం, బరువు పెరగడం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.