06-03-2025 12:10:59 AM
నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, మార్చి 5 (విజయక్రాంతి): ప్రముఖ కళ్లజోళ్ల తయారీ సంస్థ ‘లెన్స్‌కార్ట్’.. ప్రపంచంలోనే అతిపెద్ద అధునాతన మ్యానుఫాక్చరింగ్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోతోంది. తుక్కుగూడలోని నాన్‌సెజ్ జనరల్ పార్కులో సంస్థ తయారీ యూనిట్‌కు గురువారం ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు శంకుస్థాపన చేయనున్నారు.
కంపెనీ హెడ్డాఫీస్ గురుగ్రామ్‌లో ఉంది. దీని తయారీ సంస్థ ప్రస్తుతం రాజస్థాన్‌లో ఉంది. అక్కడ తయారైన ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అవుతున్నాయి. అయితే ఇప్పుడు రాజస్థాన్‌లో ఉన్న సెంటర్ కంటే.. అతిపెద్ద సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
గతేడాది డిసెంబర్ 8న లెన్స్‌కార్ట్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎంవోయూ కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం.. రూ.1,500 కోట్లతో ఆ సంస్థ ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతోంది. సెంటర్ ఏర్పాటుతో ప్రత్యక్షంగా 1,600 మందికి కొత్తగా ఉద్యోగాలు రానున్నాయి.