13-04-2025 08:31:15 PM
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
జుక్కల్,(విజయక్రాంతి): జుక్కల్ నియోజకవర్గం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు తౌలాఖనాల ప్రాజెక్టు మిగతా అన్ని ప్రాజెక్టులు కూడా వాటి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జుక్కల్ ఎమ్మెల్యే కోట లక్ష్మి శాంతారావు అన్నారు. ఆదివారం హైదరాబాద్లోని ఎర్రమంజిల్ లో గల జలసౌధలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన నీటిపారుదల శాఖ సమీక్షా సమావేశం జరిగింది. ఇందులో ఇందులో జుక్కల్ ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు మాట్లాడుతూ.. జుక్కల్ నియోజకవర్గంలోని కౌలాస్ నాలా ప్రాజెక్ట్ కు మరమ్మత్తులు చేపట్టాలన్నారు. సింగితం రిజర్వాయర్ రిటర్నింగ్ వాల్ పనులతో పాటు పెద్ద ఏడ్గి కాల్వ కు మరమ్మత్తులు, బిచ్కుంద కమ్మరి చెరువు మరమ్మత్తులు చేయాలన నియోజకవర్గంలోని చిన్న చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టాలని మంత్రి గారికి విన్నవించగా, మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.