13-03-2025 10:09:23 PM
బూర్గంపాడు,(విజయక్రాంతి): భద్రాచలం సీతారాముల కల్యాణానికి వినియోగించే గోటి తలంబ్రాలను సమర్పించేందుకు పాదయాత్ర ద్వారా వస్తున్న భక్తులకు మండల పరిధిలోని మొరంపల్లి బంజరు బస్టాండ్ ప్రాంతంలో భద్రాచలం రవాణా శాఖ అధికారి వెంకట పుల్లయ్య మజ్జిగ, నిమ్మరసం అందించారు. ఎండ తాపం నుండి ఉపశమనం కోసం బంజరు గ్రామానికి చెందిన కొందరు పెద్దలు ఈ మజ్జిగ, నిమ్మరసం తయారుచేసి అందించారు. కార్యక్రమంలో తమ్మినేని శ్రీనివాసరావు, బాలిరెడ్డి, కృష్ణార్జున, చారి తదితరులు ఉన్నారు.