calender_icon.png 12 March, 2025 | 6:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్గీకరణకు చట్టబద్ధత కల్పించండి

12-03-2025 12:30:53 AM

  1. ఆ తర్వాతే ఉద్యోగ నియామకాలు చేపట్టాలి
  2. ఎంఎస్‌పి జాతీయ నేత వేల్పుల సూరన్న మున్నూరు కాపు

హనుమకొండ, మార్చి 11 (విజయ క్రాంతి): ఎస్సీ వర్గీకరణకు  చట్టబద్ధత కల్పించాకే  ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ఎం ఎస్ పి  జాతీయ నేత వేల్పుల సూరన్న కాపు అన్నారు. ఎస్సీల వర్గీకరణకు చట్టబద్ధత కాల్పించకే ఉద్యోగ ఫలితాలు విడుదల చెయ్యాలని ఎం ఆర్ పి ఎస్, ఎం ఎస్ పి తో పాటు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం హనుమకొండ బాలసముద్రంలోని ఏకశిలా పార్కు వద్ద రిలే దీక్షలను చేపట్టారు.

ఈ కార్యక్రమంలో ఎం ఆర్ పి ఎస్  జిల్లా అధ్యక్షులు గద్దల సుకుమార్ మా దిగ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎం ఎస్ పి  జాతీయ నేత వేల్పుల సూరన్న కాపు మాట్లాడుతూ ఎస్సీల వర్గీకరణకు అనుకూలంగా ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా అదే రోజు అ సెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి హోదాలో రే వంత్ రెడ్డి  మాట్లాడుతూ ఎస్సీల వర్గీకరణ కు చట్టబద్ధత కల్పిస్తామని, ఇదివరకు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్ లలో ఎస్సీల వర్గీకరణ అమలు అయ్యేలా  అవసరమైతే ప్రత్యేకమైన ఆర్డినెన్స్ తీసుకువచ్చి మాదిలకు న్యా యం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారని అన్నారు.

ఇప్పుడు మాట మా ర్చి ఇదివరకు ఇచ్చిన నోటిఫికేషన్ లకు వర్గీకరణ అమలు చెయ్యం అంటే ఆయన చరిత్ర హీనుడిగా మాట నిలబెట్టుకోలేని చేతగాని ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి మాదిగలను నమ్మించి మోసం చేశాడని మాదిగల గొంతు కోశాడని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఆత్మ పరిశీలన చేసుకొని మాదిగలకు ఇచ్చిన మాట నిలబె ట్టుకోవడానికి ఎస్సీల వర్గీకరణకు బుధవారం జరగబోయే అసెంబ్లీ సాక్షిగా చట్టబ ద్ధత కల్పించి ఇదివరకు ఇచ్చిన నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణ అమలు చేసి మాది గలకు సంపూర్ణమైన న్యాయం చేయాలని లేని పక్షంలో మాదిగ జాతి నుండి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి తీవ్ర వ్యతిరేకత వస్తుందని హెచ్చరించారు.

మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో మాదిగలు చేసిన 30 ఏళ్ల పోరాటం ఉద్యోగాల కోసం అని అలాంటి ఉద్యోగాలలో వర్గీకరణ అమలు చేయకుం డా మళ్లీ ఎన్నడో ఇచ్చే ఉద్యోగ నోటిఫికేషన్ లలో వర్గీకరణ అమలు చేసిన ఫలితం ఉండదని మళ్లీ మాదిగలు ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చే సంవత్సరం వరకు నష్టపోతారని పేర్కొన్నారు.

దీనికి సీఎం రేవంత్ రెడ్డి కారణమని ఇంత అన్యాయం చేస్తున్న రేవంత్ రెడ్డి మా దిగల వ్యతిరేకిగా చరిత్రను నిలిచిపోతాడని హెచ్చరించారు. ఆయనకు రాజకీయంగా అండగా నిలబడింది మాదిగలరని ప్రతిసారి వేదికల మీద చెప్పిన రేవంత్ రెడ్డి మాదిగల కష్టంతో గెలిచిన రేవంత్ రెడ్డి మాదిగలను నమ్మించి ఇప్పుడు మాదిగలకే ద్రోహం చేస్తున్నాడనివిమర్శించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్రఉపాధ్యక్షులు జన్ను దినే ష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి జిల్లా ఇన్చార్జి మంద రాజు మాదిగ, ఎంఎస్‌పి జి ల్లా అధ్యక్షులు బండారి సురేందర్ మాది గ, ఎంవైఎస్ జాతీయ నాయకులు చేతల్ల శివ మాదిగ ,ఎమ్మెస్ పి జిల్లా సీనియర్ నాయకులు అక్కెనకుంట వెంకటస్వామి మాదిగ, జెరిపోతుల సారంగపాణి మాదిగ, ఎంఎస్ పి మండల అధ్యక్షులు మంద వీరస్వామి మాదిగ, ఎమ్మార్పీఎస్ సోషల్ మీడియా ఇ న్ఛార్జ్ మంద వర్ధన్ మాదిగ పాల్గొన్నారు.