calender_icon.png 11 October, 2024 | 12:46 PM

ఎస్సీ రిజర్వేషన్ల చట్టబద్ధత కేంద్రానిదే

11-10-2024 01:02:11 AM

కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి 

హైదరాబాద్, అక్టోబర్ 10 (విజయక్రాంతి): ఎస్సీ రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవ న్‌రెడ్డి అన్నారు. వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

గురువారం ఆయన సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఎస్సీ వర్గీకరణపై నిర్ణయం తీసుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. విశ్రాంత హైకోర్టు జడ్జితో ఏకసభ్య కమిటీని కూడా నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని, రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారని ఆయన పేర్కొన్నారు.

సాంకేతిక అంశాల వల్లే డీఎస్సీ నియామకాల్లో వర్గీకరణ ప్రకా రం రిజర్వేషన్లు అమలు చేయలేకపోయినట్లు చెప్పారు. భవిష్యత్తులో చేపట్టే అన్ని నియామకాలను వర్గీకరణ ప్రకారమే చేపడుతామన్నారు.

ఎస్సీ రిజర్వే షన్ కోసం మంద కృష్ణ మాదిగ జాతీ య స్థాయిలో  పోరాటం చేయాలన్నా రు. బలహీన వర్గాల వారికి జనాభా ప్రతిపాదికన హక్కులు కల్పించాలంటే రాజ్యాంగాన్ని సవరించాలన్నారు. బలహీన వర్గాలకు స్థానిక ఎన్నికల్లో రిజ ర్వేషన్ కోసం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావాలని మోదీకి విజ్ఞప్తి చేశారు.