19-04-2025 08:29:27 PM
యాదాద్రి భువనగిరి (విజయక్రాంతి): గుడ్ ఫ్రైడే సంధర్భంగా నల్గొండ పట్టణంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్నితెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ... "ప్రపంచ వ్యాప్తంగా శాంతిని ప్రభోదించిన మహాత్ముడు యేసు క్రీస్తు అని ఆయన తెలిపారు. యావత్ మానవాళికి శాంతి, సౌభాతృత్వం, దయగుణం, ప్రేమ తత్వాన్ని ఆచరించడం బోధించిన మహాత్ముడు అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైఎస్ చైర్మన్ అబ్బాగోని రమేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మోహన్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు దుబ్బా అశోక్ సుందర్, మందాడి మధుసూదన్ రెడ్డి, సీనియర్ నేత కంచర్ల గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.