calender_icon.png 13 March, 2025 | 6:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దిగ్గజ క్రికెటర్ సయ్యద్ అబిద్ అలీ కన్నుమూత

13-03-2025 01:26:11 AM

  • అమెరికాలో తుదిశ్వాస విడిచిన హైదరాబాదీ క్రికెటర్
  • సంతాపం ప్రకటించిన గావస్కర్, మదన్‌లాల్

హైదరాబాద్, మా ర్చి 12: భారత మాజీ క్రికెటర్ సయ్యద్ అబి ద్ అలీ (83) బుధవా రం అమెరికాలో కన్నుమూశారు. కొంతకా లంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈ హైదరాబాదీ క్రికెటర్ కాలిఫోర్నియాలో తుదిశ్వాస విడిచారు. 1965 మధ్య కాలంలో సయ్యద్ అబిద్ అలీ టీమిండియాకు ప్రాతినిధ్యం వహించారు. పదేళ్ల కాలంలో భారత్ తరఫున 29 టెస్టుల్లో 1018 పరుగులతో పాటు 47 వికెట్లు, ఐదు వన్డేల్లో 93 పరుగులతో పాటు 7 వికెట్లు సాధించారు.

1975 వన్డే ప్రపంచకప్ ఆడిన భారత టీమ్‌లో సయ్యద్ సభ్యుడిగా ఉన్నారు. రంజీ ట్రోఫీలో హైదరాబాద్ తరఫున అదరగొట్టిన సయ్యద్ ఆ తర్వాత జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. బ్యాటింగ్, ఫీల్డింగ్‌తో పాటు మీడియం పేసర్‌గా రాణించి మంచి ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందారు. కాగా దిగ్గజ క్రికెటర్ మృతి పట్ల పలువురు మాజీ క్రికెటర్లు  మదన్ లాల్, సునీల్ గావస్కర్, అజారుద్దీన్, ప్రగ్యాన్ ఓజా తదితరులు సంతాపం ప్రకటించారు.

‘అలీ మృతి చాలా బాధాకరమైన విషయం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. ఓం శాంతి’ అని మదన్ లాల్ ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ.. ‘సయ్యద్ అబిద్ అలీ మృతి క్రీడా లోకానికి తీరని లోటు. పదేళ్ల పాటు తన వేగవంతమైన ఆటతో అలరించారు. ఆంధ్ర క్రికెట్‌కు అతడు అందించిన సేవలు గుర్తుండిపోతాయి’ అని తెలిపారు.