calender_icon.png 26 December, 2024 | 7:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లెజెండ్ భారత్

15-07-2024 12:10:00 AM

ఫైనల్లో పాకిస్థాన్‌పై విజయం

బర్మింగ్‌హామ్ : దాయాది పాకిస్థాన్‌పై మరోసారి భారత క్రికెట్ జట్టు ఘనవిజయం సాధించింది. వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీ ఫైనల్లో యువరాజ్ సింగ్ సారథ్యంలోని ఇండియా చాంపియన్స్ 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తుచేసింది. మొదట పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులు చేసింది. షోయబ్ మాలిక్ (41) టాప్ స్కోరర్. అనంతరం భారత్ 19.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అంబటి రాయుడు (30 బంతుల్లో 50; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. యూసుఫ్ పఠాన్ (30; ఒక ఫోర్, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు.