calender_icon.png 26 April, 2025 | 4:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సక్రమం మాటున అక్రమం

26-04-2025 12:03:31 AM

  1. పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు 
  2. అక్రమ కట్టడాలకు మున్సిపల్ అధికారుల అండదండలు?
  3. టౌన్ ప్లానింగ్ ఉన్నట్లా లేనట్లా? 

భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 25 (విజయ క్రాంతి) పట్టణ ప్రణాళికను పటిష్టంగా అమ లు చేస్తూ, అక్రమ కట్టడాలను, నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మిస్తున్న కట్టడాలను నివారిస్తూ, మున్సిపాలిటీ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా చూడాల్సిన మున్సిపా లిటీలోని పట్టణ ప్రణాళిక విభాగం మామూ ళ్ల మత్తులో తోలుతూ అక్రమ కట్టడాలకు, ఆక్రమణలకు అండగా నిలుస్తోందని ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచ మున్సిపాలిటీలో ఇబ్బడి ముబ్బడిగా అక్రమ కట్టడాలు, నిబంధనలకు వ్యతి రేకంగా భవల అంతస్తులు నిర్మాణాలు, రోడ్ల ను ఆక్రమించే దర్జాగా బవంతులను నిర్మిస్తున్న పట్టణ ప్రణాళిక అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరించడం వస్తున్న ఆరోపణలు ద్రవపరుస్తున్నాయి.

ఇటీవల కేఎస్పీ రోడ్ లో ఎలాంటి అనుమతులు లేకుండా భవనం నిర్మించిన, గట్టాయిగూడెం అల్లూరి సెంటర్లలో 60 అడుగుల విస్తీర్ణంలో నాలుగంతస్తుల భవన నిర్మించిన టౌన్ ప్లానింగ్ అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. తాజాగా చాకలి బజారులో అనుమ తి పొందిన విస్తీర్ణం కన్నా మున్సిపల్ రోడ్డు ను ఆక్రమించి జి+3 భవన నిర్మాణం చేస్తు న్న నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.

పాల్వంచ అక్రమ నిర్మాణాలపై ఇప్పటికే పలుమార్లు ఆర్జెడీకి ఫిర్యాదులు అందాయి . వివరాల్లోకి వెళితే చాకలి బజారులోని ఇంటి నెంబర్ 9-3-186 లో 60 అడుగులు స్థలం తో పాటు పాత ఇల్లు ఉల్లోజు సక్కుబాయి పేరుతో ఉంది. అట్టి ఇంటిని చూపకుండా గత ఏడాది నవంబర్ ఏడవ తేదీన డాక్యుమెంట్ నెంబర్ 4988/2023తో తన కూతురు ఉళ్లోజు వెంకట్ లక్ష్మి కి గిఫ్ట్ డేట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేశారు.

వాస్తవంగా రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే ఆస్తి వెంకట్ లక్ష్మి పేరుతో మార్పు జరగాల్సి ఉంది. కానీ నేటికీ ఆ ఇంటి నెంబర్ సక్కుబాయి పేరుతో కొనసాగటం అనుమానాలకు దారితీస్తోంది. ఉన్న స్థలం 60 అడుగులు కాగా మున్సిపాలిటీ రోడ్డు 15.5 అడుగులు  ఆక్రమించి 75.5 అడుగుల్లో జి+3 అక్రమంగా భవన నిర్మాణం జోరుగా సాగుతోందని ఆరోపణలు వస్తున్నాయి.

భవన నిర్మాణానికి అనుమతులు ఇచ్చామంటున్న టౌన్ ప్లానిం గ్ అధికారులు నిర్మించే ప్రాంతాన్ని పరిశీలించిన దాఖలాలు లేవు. అధికారులు చెప్పిన ప్రకారం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ప్రకారం భవన నిర్మాణానికి అనుమతిలిస్తే ఇంటి ప న్ను సక్కుబాయికి బదులు వెంకటలక్ష్మి పేరు రావాల్సి ఉంటుంది.  పేరు మార్పు జరగకపోవడం భావన నిర్మాణానికి అనుమతులు లేవనే అనుమానాలు ఆరోపణలు వెలబడుతున్నాయి.

జి +2 అనుమతి పొంది జి+3 భవన నిర్మిస్తున్న అధికారులు పట్టించుకోక పోవడం అక్రమ నిర్మాణాలకు అధికారుల అండదండ అనే ఆరోపణ అక్షర సత్యం అని చెప్పక తప్పదు. దీన్నిబట్టి పాల్వంచ మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ ఉన్న లేనట్లే అని తేడాతెలమవుతుంది. ఇప్పటికైనా పాల్వంచ పట్టణ ప్రణాళిక అధికారులు అక్రమ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, కోట్ల విలువైన మున్సిపల్ ఆస్తులు ఆక్రమణలు జరగకుండా కాపాడాలని, నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

ఈ విషయమై మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి నవీన్ కుమార్ ను వివరణ కోరగా ఆ ఇంటికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ప్రకారం వెంకటలక్ష్మి పేరుతో జి +2భవన నిర్మాణానికి అనుమతులు ఇచ్చామన్నారు. ఒకవేళ జి+3 భవన నిర్మిస్తే వారి నుంచి అపరాధ రుసుము వసూలు చేస్తామని సమాధానమిచ్చారు.

కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణాలు జరిగితే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చి వేయవచ్చని, 25% పెనాల్టీ వసూలు చేయాలని చట్టం చెబుతుంది కదా దాన్ని ఎందుకు అమలు చేయడం లేదని అడిగిన ప్రశ్నను దాటవేశారు.