calender_icon.png 11 January, 2025 | 4:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిల్లల సంరక్షణకు న్యాయ సేవలు

11-01-2025 01:25:16 AM

* జిల్లా ప్రధాన న్యాయమూర్తి డీ రాజేశ్‌బాబు

నాగర్‌కర్నూల్, జనవరి 10 (విజయ క్రాంతి): బాలబాలికల సంరక్షణ కొరకు స్నేహ పూర్వకమైన న్యాయ సేవలు అందిం చాలన్న లక్ష్యంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ సబిత ఆధ్వర్యంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ (డీఎల్‌ఎస్‌ఏ) స్పెషల్ కమిటీ నియమించి నట్లు జిల్లా జడ్జి డి.రాజేష్ బాబు తెలిపారు.

గురు, శుక్ర వారాలు రెండు రోజులపాటు ఈ కమిటీలోని సభ్యులందరికీ వివిధ రకాల రిసోర్స్ పర్సన్స్ ద్వారా జువైనల్ జస్టిస్, ఫోక్సొ చట్టం, సిడబ్ల్యూసి కమిటీ బాధ్యతలు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సంస్థ యొక్క బాధ్యతలపై శిక్షణ ఇచ్చామన్నారు. 18 ఏళ్ల లోపు చిన్నారులు బాధితులుగా, సాక్షులుగా, చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నవా రుగా గుర్తించినప్పటికీ ఏ సందర్భంలోనూ వారి హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. 

ఉజ్వల, సఖి, షీటీం, భరోసా, బాలసదన్ తదితర అన్ని రకాల ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకొని పిల్లల ఎదుగుదలకు కృషి చేయాలన్నారు. వారితో పాటు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా సీనియర్ సివిల్ జడ్జి సబిత, జూనియర్ సివిల్ జడ్జి మౌనిక, ఏఎస్పీ రామేశ్వర్, జేజే బోర్డు సభ్యురాలు గిరిజ ప్రీతి, మానసిక వైద్య నిపుణులు అసిస్టెంట్ ప్రొఫెసర్ అంబుజా, చీఫ్ లీగలెర్ డిఫెన్స్ కౌన్సిల్ మధుసూదన్ రావు, సిడబ్ల్యుసి చైర్ పర్సన్ లక్ష్మణ్ రావు, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శ్రీశైలం, జిల్లా విద్యాశాఖ రిసోర్స్ పర్సన్ వెంకటయ్య, దేవిక, కేశవరెడ్డి, రాజు, బాలరా జు, డిఎల్‌ఎస్‌ఏ కమిటీ సభ్యులు గుండూరు శ్యాంకుమార్, మల్లేష్, బాలస్వామి, తిరుప తయ్య, మల్లీశ్వరి, పార్వతమ్మ  ఇతర కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.