calender_icon.png 19 February, 2025 | 10:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత్తు పదార్థాలతో జీవితం అంధకారం

15-02-2025 08:49:01 PM

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): మత్తు పదార్థాల వినియోగంతో జీవితం అంధకారం అవుతుందని, డ్రగ్స్, గంజాయి వంటి వాటికి దూరంగా ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి(District Legal Services Authority Secretary G. Bhanumathi) అన్నారు. స్థానిక ధన్వంతరీ ఫార్మసీ కళాశాల(Dhanwantari Pharmacy College)లో శనివారం జరిగిన న్యాయ చైతన్య కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. యువతకు బాధ కలిగినప్పుడు మత్తు పదార్థాలకు అలవాటు పడి దాన్ని వ్యసనంగా మార్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవితం గడపాలని సూచించారు. విద్యార్థి దశలో క్రమశిక్షణ కలిగి చెడు అలవాట్లకు లోను కాకుండా ఉండాలని, ఉన్నత లక్ష్యాలతో అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వి.పురుషోత్తమరావు, డిప్యూటీ కౌన్సిల్ పి.నిరంజన్ రావు, కళాశాల ప్రిన్సిపల్స్ రామకోటేశ్వరరావు, నాగరాజు సుజాతనగర్ ఎస్సై రమాదేవి , షీ టీమ్ ఎస్ఐ పి.రమాదేవి, న్యాయవాది మెండు రాజమల్లు  కళాశాల అధ్యాపకులు  తదితరులు పాల్గొన్నారు.