భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): ప్రస్తుత సమాజంలో విలువలతో కూడిన విద్య సమాజానికి చాలా అవసరమని న్యాయమూర్తి జి.భానుమతి అన్నారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట నియోజకవర్గం పరిధిలోని, అన్నపురెడ్డిపల్లిలో గల మహాత్మా జ్యోతిబాపూలే బాలుర డిగ్రీ, జూనియర్ వసతి గృహంలో జరిగిన న్యాయ అవగాహన కార్యక్రమంలో న్యాయమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగ న్యాయమూర్తి మాట్లాడుతూ... జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోవాలని తెలిపారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని తెలిపారు.వ్యక్తి ఆత్మవిశ్వాసం చదువు వలన బలపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ పి.నిరంజన్ రావు, అన్నపురెడ్డిపల్లి ఏఎస్ఐ ప్రసాద్, ప్రిన్సిపాల్, హాస్టల్ వార్డెన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.