calender_icon.png 22 March, 2025 | 3:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమ్యూనిటీ వర్గాలకు న్యాయ అవగాహన

21-03-2025 09:09:40 PM

సంగారెడ్డి న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. రమేష్

సంగారెడ్డి,(విజయక్రాంతి): కులాలు, మతాల వారీగా వారి వారి కమ్యూనిటీ హాలు నిర్మించుకొని అందులో తగు వివాదాలు పరిష్కరించుకోవాలి. పెద్దల వారి సమక్షంలో సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలి సంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.రమేష్(Sangareddy Legal Services Authority Secretary B. Ramesh) తెలిపారు. శుక్రవారం సంగారెడ్డిలో జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల ప్రకారం... జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. భవానిచంద్ర ఆదేశాల మేరకు న్యాయ సేవ సదన్ భవనం నందు, వివిధ వర్గాల ప్రతినిధులకు న్యాయ అవగాహన కల్పించారు. కోర్టుల చుట్టూ తిరిగి సమయాన్ని వృధా చేసుకోకుండా, న్యాయ పరమైన విషయాలలో ఉచిత న్యాయ సహాయం అందిస్తామని ఏదైనా న్యాయ సహాయం కోరినచో న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయం, సంగారెడ్డిని సంప్రదించాలని కోరారు. వివిధ వర్గాల సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.