హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 6 (విజయక్రాంతి): నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లోని 84వ ఆలిండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌లో ప్రజల కోసం తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత న్యాయ సలహా కేంద్రాన్ని (స్టాల్ నంబర్ 1993, 1994) హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయ సేవల అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ సుజోయ్‌పాల్ సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు చట్టాలు, పథకాలపై సరైన అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఈ ఉచిత న్యాయ సలహా కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ సీహెచ్ పంచాక్షరి, సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి వై రేణుక, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ జిల్లా జడ్జి ఎస్ శశిధర్, అధికారులు జీ కలార్చన, జావీద్ పాషా, కిరణ్ కుమార్, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.