calender_icon.png 3 December, 2024 | 11:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చట్టబద్ధమైన దత్తత తీసుకోవాలి

09-08-2024 12:39:35 AM

కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్, ఆగస్టు 8: కరీంనగర్ శిశుగృహ నుంచి 5 నెలల పాపను దత్తత తీసుకున్న బెంగుళూరుకు చెందిన దంపతులకు కలెక్టర్ పమేలా సత్పతి గురువారం దత్తత ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పిల్లలు లేని దంపతులు చట్టబద్ధమైన దత్తత తీసుకోవాలని అన్నారు. అనాథ శిశువుల దత్తత, రక్త సంబంధీకుల నుంచి దత్తత తీసుకోవాలనుకునేవారు జిల్లా సంక్షేమ అధికారి కార్యాయలంలో సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, పీవో తిరుపతి తదితరులు పాల్గొన్నారు.