calender_icon.png 25 January, 2025 | 5:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుమతి లేని ఆస్పత్రులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి

24-01-2025 11:39:12 PM

హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి...

హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): జిల్లాలోని అనుమతి, అర్హత లేని ఆస్పత్రులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఆక్ట్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అనుమతి, రిజిస్ట్రేషన్ లేని ఆస్పత్రులకు మొదటి విడత రూ.50వేల జరిమాన విధించాలన్నారు. జిల్లాలో గడువు ముగిసిన 28 ప్రైవేట్ ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులిచ్చి, రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని సూచించారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో అర్హత గల డాక్టర్లే విధులు నిర్వహించాలని, నిబంధనలు పాటించని ఆస్పత్రులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ కదిరవన్, అడిషనల్ డీసీపీ డా.మనోహర్, డీఎంహెచ్‌వో డా.జె.వెంకటి, ఐఎంఏ అధ్యక్షుడు డా.శ్రీరంగ్ అబ్కారీ తదితరులు పాల్గొన్నారు. 

రేపు విధిగా ఓటర్ల ప్రతిజ్ఞ చేయాలి కలెక్టర్...

జనవరి 25న జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో విధిగా ఓటర్ల ప్రతిజ్ఞ చేయాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. అధికారులు సిబ్బంది తప్పక ఈ కార్యక్రమం నిర్వహించాలని ఒక ప్రకటనలో తెలిపారు.