calender_icon.png 22 April, 2025 | 1:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంఆర్ పెండింగ్ ఉంటే చట్టపరమైన చర్యలు

21-04-2025 11:44:01 PM

భైంసా,(విజయక్రాంతి): పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో రైస్ మిల్లలకు కేటాయించిన వరి ధాన్యం సీఎంఆర్ బియ్యం అప్పగించని రైస్ మిల్లులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ హెచ్చరించారు. సోమవారం బైంసా పట్టణంలో రైస్ పిల్లలతో సమావేశం నిర్వహించి సిఎంఆర్బిఎం సేకరణపై సమీక్ష నిర్వహించిన ఆమె పెండింగ్ బియ్యాన్ని వెంటనే ప్రభుత్వానికి అప్పగించాలని సూచించారు. పెండింగ్ బియ్యం ఎక్కువగా ఉన్న రైస్ మిల్లర్లకు నోటీసులు అందిస్తామని అప్పటికి స్పందించకపోతే చట్టపరమైన చర్యలు చేపడతామని భవిష్యత్తులో ధాన్యం కేటాయింపులు ఉండబోవని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ డిఎస్ఓ కోమల్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు.