వనపర్తి టౌన్, ఫిబ్రవరి 1 : పని చేసే చోట మహిళలకు వేధింపులకు గురి చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని , లోకల్ కంప్లయింట్ కమిటీ చైర్మన్, స్పెషల్ డిప్యూ టీ కలక్టర్ ప్రమోదిని అన్నారు.వనపర్తి జిల్లా ఐ.డి. ఒ.సి. సమావేశ మందిరంలో శనివా రం మధ్యాహ్నం జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వ ర్యంలో లోకల్ కంప్లయింట్ కమిటీ సమా వేశం నిర్వహించారు.
పురుషులతో సమా నంగా మహిళలు పని చేసుకునే విధంగా మహిళా రక్షణ చట్టాలు, జిల్లా కలక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశాల మేరకు ఇప్పటికే అ న్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే మహి ళలను లైంగిక వేధింపులకు గురి చేస్తే ఫిర్యా దు చేసేందుకు ఇంటర్నల్ కంప్లయింట్ కమిటీలు, ఆ పై జిల్లాస్థాయిలో లోకల్ కంప్ల యింట్ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా చైర్మన్ ప్రమోదీ ని మాట్లాడుతూ పని ప్రదేశంలో మహిళ లపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని అన్నారు. కార్యాలయా లలో తదితర ప్రదేశాలలో మహిళలపై శారీరిక, మానసిక వేధింపులకు పాల్పడితే బాధ్యులపై చట్ట పరంగా తగిన శిక్షలు ఉంటా యని బాధితులు ఇంటర్నల్ కమిటీకి ఫిర్యా దు చేయాలని లేదా లోకల్ కమిటీకి ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఈ సమా వేశంలో జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, కమిటీ సభ్యులు డి.ఆర్డీఓ ఉమాదేవి, జిల్లా ఇమ్మునైజేషన్ అధికారి పరిమళ, రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ప్రెసిడెంట్ చిన్నమ్మ థామస్, సిడిపిఓలు, లక్ష్మమ్మ, హజీరా, బాలేశ్వరి, సూపర్డెంట్ అరుంధతి తదిత రులు పాల్గొన్నారు