సిఐటియు జిల్లా అధ్యక్షుడు రాజేందర్..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు రాజేందర్ డిమాండ్ చేశారు. సోమవారం వీఆర్ఏల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ.. జీవో నెంబర్ 81 ప్రకారం 61 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏల స్థానంలో వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 20,655 మంది వీఆర్ఏలలో 16,768 మందిని ప్రభుత్వం వివిధ శాఖల్లో సర్దుబాటు చేయడం జరిగిందని తెలిపారు. మిగతా 3797 మంది వీఆర్ఏ ల వారసులకు ఉద్యోగ ఉత్తర్వులు ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేసిందన్నారు. జీవో 81, 86 ప్రకారం వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు వాళ్ళని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏ జేఏసీ నాయకులు పాల్గొన్నారు.