calender_icon.png 23 January, 2025 | 1:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లీ ఫార్మా పరిశ్రమ కార్మికుడు మృతి

22-01-2025 10:32:17 PM

పటాన్ చెరు: జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని లీ ఫార్మా పరిశ్రమలో పనిచేసే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మనోజ్ (28) కార్మికుడు మంగళవారం రాత్రి మృతి చెందాడు. మంగళవారం మధ్యాహ్నం షిఫ్ట్ డ్యూటీకి వచ్చిన మనోజ్ రాత్రి 8:30 సమయంలో పరిశ్రమలోని బ్లాక్ లో రియాక్టర్ వద్ద సెంటర్ ప్యూజ్ అన్ లోడ్ చేస్తుండగా ఒక్కసారిగా ఫోమ్ గొంతు, ముక్కులోకి వెళ్లడంతో ఊపిరాడక కళ్ళు తిరిగి పడిపోయాడు. కొద్దిసేపటి తరువాత అతన్ని తన గదికి పరిశ్రమ యాజమాన్యం పంపించింది. కాగా తీవ్ర అస్వస్థతకు గురైన మనోజ్ మృతి చెందాడు.  అస్వస్థతకు గురైన వెంటనే ఆసుపత్రికి తరలించి ఉంటే మనోజ్ బ్రతికేవాడని మృతి చెందిన తర్వాత ఆస్పత్రికి తరలించారని అతని కుటుంబీకులు తెలిపారు.