calender_icon.png 1 January, 2025 | 11:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్‌ఈడీ టీవీల దొంగ అరెస్ట్

28-10-2024 01:19:39 AM

నిజామాబాద్ (కామారెడ్డి), అక్టోబర్27 (విజయక్రాంతి): నిజామా బాద్ రైల్వేస్టేషన్‌లో మహారాష్ట్రలోని ధర్మాబాద్‌కు చెందిన మాధప్ప అనే ప్రయాణికుడు రెండు ఎల్‌ఈడీ టీవీలను పక్కన పెట్టుకొని పడుకోగా ఓ వ్యక్తి వాటిని దొంగిలించాడు. బాధితుడు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు మోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మహ రాష్ట్రలోని కిన్వాట్‌కు చెందిన శంకర్ నాగురావును సదరు టీవీలను దొంగిలించినట్లు గుర్తించి ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు నిజామాబాద్ రైల్వే ఎస్‌ఐ సాయిరెడ్డి తెలిపారు.