calender_icon.png 30 October, 2024 | 10:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సలీమా నేతృత్వంలో

29-10-2024 12:37:39 AM

న్యూఢిల్లీ: ఆసియా చాంపియన్స్ ట్రోఫీకి హాకీ ఇండియా సోమవారం 18 మందితో కూడిన భారత జట్టును ప్రకటించింది. సలీ మా టిటే కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. ఆమె డిప్యూటీగా నవ్‌నీత్ కౌర్ ఉండనుంది. అనుభవజ్ఞురాలైన సవితాతో పాటు  బిచూ దేవి గోల్ కీపింగ్ బాధ్యతలు తీసుకోనున్నారు. సలీమా, నేహా, షర్మిలా దేవి, మనిశా చౌహాన్, మిగతా వాళ్లతో మిడ్ ఫీల్డ్ బలంగా కనిపిస్తుండగా..

డిఫెన్స్ విభాగంలో ఉదితా, జ్యోతి, ఇషికా, వైష్ణవి.. నవ్‌నీత్ కౌర్, సంగీతా కుమారి, దీపికా ఫార్వార్డ్ ప్లేయర్లుగా ఉన్నారు. కాగా గతేడాది రాంచీ వేదికగా జరిగిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన భారత్ మరోసారి ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

నవంబర్ 11 నుంచి 20 వరకు బిహార్‌లోని కొత్తగా నిర్మించిన రాజ్‌గిర్ హాకీ స్టేడియం వేదికగా మ్యాచ్‌లు జరగనున్నాయి. టోర్నీలో భారత్‌తో పాటు చైనా, జపాన్, కొరియా, మలేషియా, థాయ్‌లాండ్ పాల్గొననున్నాయి. కాగా భారత్ తమ తొలి మ్యాచ్‌ను నవంబర్ 11న మలేషియాతో ఆడనుంది.