calender_icon.png 10 January, 2025 | 1:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడవి బాట వీడి.. పోలీసు కొలువులు సాధించి

09-01-2025 01:07:19 AM

..ఆపై నక్సల్స్ దాడిలో బలి

* మందుపాతర పేలిన ఘటనలో అమరులైన ఐదుగురూ మాజీ నక్సలైట్లే..

రాయ్‌పూర్, జనవరి 8: ఛత్తీస్‌గఢ్‌లోని మందుపాతర ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 8 మంది భద్రతా సిబ్బందిలోలో ఐదుగురు మాజీ నక్సలైట్లు ఉన్నారని బస్తర్ రేంజ్ ఐజీ సుందరరాజ్ మీడియాకు తెలిపారు. హెడ్ కానిస్టేబుల్ బుధ్రమ్ కోస్రా, కానిస్టేబుల్ దుమ్మా మర్కమ్, పాండరు రామ్, బామన్ సోధీ, కానిస్టేబుల్ సోమ్దు వెట్టి.. గతంలో నక్సలైట్లుగా పని చేసినట్టు చెప్పారు.

ఆ తర్వాత వాళ్లు నక్సలిజాన్ని వీడి పోలీస్ ఫోర్స్‌లో చేరినట్టు పేర్కొన్నారు. బెద్రే రోడ్డులో సోమవారం మధ్యా హ్నం 2.15 గంటల ప్రాంతంలో మందుపాతర పేలిన ఘటనలో ఈ ఐదుగురూ ప్రాణా లు కోల్పోయినట్టు వెల్లడించారు. గత ఏడాది బస్తర్ రీజియన్‌లోనే దాదాపు 792 మంది నక్సలైట్లు పోలీసుల ఎదుట లొంగిపోయినట్టు చెప్పారు.

జన జీవన స్రవంతిలో కలిసిన మాజీ నక్సల్స్‌ను డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్(డీఆర్‌జీ) పేరుతో పోలీస్ ఫోర్స్‌లో చేర్చుకుం టున్నట్టు వివరించారు. సోమవారం జరిగిన దాడిని గత రెండేళ్లలో జరిగిన అతిపెద్ద నక్సల్ దాడిగా ఆయన పేర్కొన్నారు.