calender_icon.png 24 October, 2024 | 10:57 PM

అభివృద్ధిని వదిలేసి వసూళ్ల్ల బాట

11-07-2024 01:19:00 AM

  1. అటకెక్కిన సంక్షేమ పథకాలు
  2. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శ

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 10 (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రె స్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధ్దిని వదిలేసి రియల్ ఎస్టేట్ సంస్థల దగ్గర దాదాపు రూ. 100 కోట్ల దాకా అక్రమ వసూళ్లు చేశారని కేంద్ర మంత్రి జీ. కిషన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లను ఇస్తామని చెప్పిన కేసీఆర్ ఫామ్ హౌస్‌కు వెళ్లాడని వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధి అంబర్‌పేటలో కిషన్ రెడ్డి బుధవారం పలు ప్రాంతా లలో పర్యటించి, స్థానికుల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పటేల్ నగర్ చౌరస్తా, గోశాల, ప్రేమ్‌నగర్ బస్తీలలో పర్య టించారు. స్థానికులతో ముచ్చటించి వారి సమస్యలను తెలుసుకున్నారు. 

అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ కార్య క్రమాలు అమలు కావడం లేదని విమర్శించారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదలకు రేషన్ కార్డులు  మంజూరు చేయలేదన్నారు. రేష న్ కార్డులు ఇవ్వనందున కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న 5 కిలోల ఉచిత బియ్యాన్ని పేదలు అందుకోలేకపోతున్నట్టు తెలిపారు. వీరంతా పొదుపు సంఘాలలో చేరనందున గ్యాస్ కనెక్షన్ కూడా తీసుకోలేకపోతున్నట్టు తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో స్ట్రీట్ లైట్లు వెలగడం లేదని అధికారులకు చెబితే డబ్బులు లేవని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. నెలలు గడుస్తున్నా రోడ్లను మరమ్మతులు చేయడం లేదన్నారు.  

 కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని, కాలేజీకి వెళ్లే విద్యార్థినిలకు ఎలక్ట్రిక్ స్కూటీలను ఇస్తామని చెప్పిన హామీలు ఏమయ్యాయని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రజల సమస్యలను పట్టించుకునే నాథుడు హైదరాబాద్‌లో లేడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో భాగంగా పటేల్ నగర్ గోశాలలో కేంద్రమంత్రి గోవులకు సేవ చేశారు.