- గతేడాది దేశాన్ని వీడిన దాదాపు 4లక్షల మంది భారతీయులు
- 2021 మధ్య మూడు రెట్లు పెరిగిన సంఖ్య
న్యూఢిల్లీ, నవంబర్ 26: పని కోసం విదేశాలకు వెళ్తున్న భారతీయుల సంఖ్య క్రమం గా పెరుగుతోందని కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ చౌదరి పార్లమెంట్ లో పేర్కొన్నారు. శీతాకాల సమావేశాల సం దర్భంగా ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయ న సమాధానమిస్తూ 2021 మధ్య ఇమ్మిగ్రేషన్‌ను క్లియర్ చేసిన నైపుణ్యం లేని, సెమీ స్కిల్డ్ కార్మికుల సంఖ్య మూడు రెట్లు పెరిగిందని చెప్పారు.
2021లో 1,32,675 మంది కార్మికులు ఇమ్మిగ్రేషన్‌ను క్లియర్ చేయగా 2023 నాటికి ఈ సంఖ్య 3,98, 317కు చేరినట్టు వివరించారు. విదేశాల్లో భారతీయులకు పని కల్పించే ఏజెంట్లు, యజమానులు ఈమైగ్రేట్ పోర్టల్‌లో రిజిస్టర్ కావాల్సి ఉంటుందని చెప్పారు.
అలాగే పనికి సంబంధించిన నియమనిబంధనలు, జీత భత్యాలను తెలియజేయా ల్సి ఉంటుందన్నారు. ఈ క్రమంలోనే దాదా పు 2,200 మంది ఏజెంట్లు, 2,82,000 మంది విదేశీ యజమానులు పోర్టల్‌లో రిజిస్టరైనట్లు వివరించారు. భారత ప్రభుత్వం ఇప్పటి వరకు ఇజ్రాయెల్ సహా మరో ఐదు దేశాలతో కార్మికుల విషయంలో ఒప్పందం కుదుర్చుకుంది.