calender_icon.png 9 January, 2025 | 2:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముంబైని వీడి దక్షిణాదికి వెళ్తున్నా..

01-01-2025 12:00:00 AM

చిత్ర దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ ప్రస్తుత బాలీవుడ్ స్థితిపై అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ముంబైని విడిచిపెట్టి దక్షిణాదికి మారే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో.. హిందీ చిత్ర పరిశ్రమలో క్రియేటివిటీ, నూతన ఆవిష్కరణలను లా భాలు, రీమేక్‌లు, స్టార్- మేకింగ్ సంస్కృతిపై పెరుగుతున్న మక్కువ అణవిస్తున్నాయని తెలిపారు.

“ఇప్పుడు నేను బయటకు వెళ్లి ప్రయోగాలు చేయడం అనేది కష్టంతో పాటు ఖర్చుతో కూడుకున్నది. సినిమా ప్రా రంభానికి ముందే దానిని ఎలా అమ్మాలి అనే విషయంపై దృష్టి పెరుగుతోంది. కాబట్టి సినిమా నిర్మాణంలో ఆనందం లేకుండా పోయింది. అందుకే వచ్చే ఏడాది ముంబైని వీడి దక్షిణాదికి వెళ్తున్నాను.

క్రియేటివిటీకి ఆస్కారం ఉన్న చోటుకి వెళ్లిపోతా.. లేకుంటే వృద్ధుడిలా చనిపోతాను. నా సొంత పరిశ్రమపై నాకు నిరాశ, అసహ్యం కలిగాయి” అని అనురాగ్ కశ్యప్ తెలిపారు. ఇటీవల మలయాళ యాక్షన్ థ్రిల్లర్ ‘రైఫిల్ క్లబ్’లో ఆయన నటించారు. ఆషిక్ అబు దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 19న థియేటర్లలో విడుదలైంది.