calender_icon.png 16 November, 2024 | 3:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెంటిమెంట్‌ను పక్కన పెడతారా!

07-11-2024 12:00:00 AM

సినిమాల్లో సెంటిమెంట్‌ను బాగా ఫాలో అవుతారు. ఈ క్రమంలోనే రాజమౌళి, సుకుమార్ వంటి దర్శకులకు సెంటిమెంటో లేదంటే అలవాటైపోయిందో కానీ సంగీత దర్శకులను మాత్రం మార్చరు. ఇప్పటివరకు వీరి సినిమాలు కథ పరంగానే కాకుండా సంగీత పరంగానూ మంచి విజయం సాధించాయి. సుకుమార్ ఆది నుంచి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్నే నమ్ముకున్నారు.

అలాగని ఆయన కూడా ఎప్పుడూ ప్రేక్షకులను నిరుత్సాహపరచలేదు. అందుకే ‘ఫుష్ప2’పై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. అయితే, ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలకు ప్రేక్షకుల నుంచి ఆశించినంత హైప్ రాలేదని చిత్రబృందం భావిస్తోందట. సుకుమార్ ఇప్పుడు అదే ఆలోచనలో పడ్డారట.

వేరే సంగీత దర్శకుడికి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పని అప్పగిస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారట. ఈ క్రమంలోనే ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న సంగీత దర్శకుల పేర్లను పరిశీలిస్తున్నారట. దేవితో పాటు మరొకరితోనూ బ్యాగ్రౌండ్ స్కోర్ చేయించుకుని రెండింటిలో ఏది బాగుంటే దాన్ని ఉపయోగించుకోవాలని చూస్తున్నారని టాక్. మరి సుకుమార్ సెంటిమెంటును అన్‌ఫాలో చేస్తారో లేదో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే!