మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, నవంబర్ 9 (విజయక్రాంతి): పాలనను గాలికి వదిలి సీఎం రేవంత్, మంత్రులు పక్క రాష్ట్రా ల్లో ఎందుకు పర్యటనలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. శనివారం ఎక్స్‌వేదికగా స్పంది స్తూ పౌర సరఫరాల శాఖ మంత్రి సొంత జిల్లాలోనే వడ్ల కొనుగోళ్లు జరగడం లేదని, మంత్రి సీతక్క జిల్లాలో మద్దతు ధరకు పత్తి అమ్ముకోలేక రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని మండిపడ్డారు.
ఫుడ్ పాయిజనింగ్ అయ్యి గురుకులాల్లో విద్యార్థులు ప్రా ణాలు కోల్పోతున్నా విద్యాశాఖ మ్ంర తిగా ఉన్న సీఎం రేవంత్ మొద్దునిద్ర వహిస్తున్నారన్నారు. ప్రజలు సమస్యలతో సతమతమవుతుంటే పట్టించు కోకుండా సీఎం సహా మంత్రులు ప క్క రాష్ట్రాల ఎన్నికల ప్రచారానికి పయనమయ్యారని మండిపడ్డారు.
జగిత్యాల జిల్లా తొంబరావుపేటలో అభివృద్ధి పనుల బిల్లులు రాక పంచాయతీ భవనాన్ని తాకట్టు పెట్టాల్సిన దుస్థితి నెలకొందని విమర్శించారు. కాంగ్రెస్ అభయ హస్తం మ్యానిఫెస్టోలో స్థానిక సంస్థలకు నిధులు, వి ధులు, నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తామని బీరాలు పలికి, ఇప్పుడు మాజీ సర్పంచులు పంచాయితీ భవనాలను తాకట్టు పెట్టే స్థితికి దిగజార్చా రని ఆవేదన వ్యక్తం చేశారు.