calender_icon.png 22 September, 2024 | 4:26 AM

అసలును వదిలి.. కొసరును చూపెట్టిర్రు!

22-09-2024 01:59:11 AM

  1. శనిగకుంట బ్లాస్టింగ్ కేసు నిందితుల అరెస్టుపై అనుమానాలు
  2. ముఖ్యులను రక్షించేందుకు చేతులు మారిన లక్షలు 

మంచిర్యాల, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండల కేంద్రంలోని శనిగకుంట చెరువు మత్తడి పేల్చివేత కేసులో అసలు నిందితులను వదిలేసి కొసరోళ్లను పట్టుకున్నారనే ప్రచారం జోరుగా సాగుతున్నది. పట్టణంలోని గాలికుంట చెరువు అలుగు పారినప్పు డు ఆ నీరు శనిగకుంటలో చేరుతుంది. చెరువులో మట్టిని నింపడం వలన వెనుకకు పోటుదన్ని ఇండ్లలోకి చేరుతుంది. చెరువులో మట్టి నింపిన నిందితులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని పట్టణవాసులు ప్రశ్నిస్తున్నారు.

39 ఎకరాల శనిగకుంట చెరువు...

శనిగకుంట చెరువు 348, 365 సర్వే నంబర్లలో 39 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దీని శిఖం 33.22 ఎకరాలుండగా, ఎఫ్‌టీఎల్ 42 ఎకరాలు, బఫర్‌జోన్‌తో కలుపు కొని సుమారు 60 ఎకరాల విస్తీర్ణంలో ఉం ది. చెరువు శిఖానికి ఆనుకుని 15.20 ఎకరాల భూమి గోదావరిఖనికి చెందిన చెరుకు బుచ్చిరెడ్డికి ఉంది. అతడి నుంచి మంచాల రాజబాపు, నడిపెల్లి లక్ష్మణ్‌రావు, లక్కం రాజబాపు, రాంలాల్ గిల్డా, బత్తుల సమ్మ య్య, పెద్దింటి శ్రీనివాస్, పోగుల శేఖర్, ఎన్న ం బానయ్య, ఇప్ప సంపత్, ఉమేష్ గిల్డా తలా కొంత కొన్నారు. వారిని నుంచి చెన్నూర్‌కు చెందిన గొడిసెల బాపురెడ్డి కొనేందుకు అగ్రిమెంటు చేసుకున్నాడు. కానీ ఆ భూమిలో నుంచి 4.20 ఎకరాలు మాత్రమే రిజిస్ట్రేషన్ కాగా మిగిలిన 11 ఎకరాల భూమి శనిగకుంట చెరువు ఎఫ్‌టీఎల్‌లో ఉండటంతో రిజిస్ట్రేషన్ కాలేదు. 

11 ఎకరాల్లో వేల ట్రిప్పుల మొరం

ఎఫ్‌టీఎల్‌లో ఉన్న 11 ఎకరాల పట్టా భూమిలో వేల ట్రాక్టర్ ట్రిప్పుల మొరంతో నింపేశారు. ఎఫ్‌టీఎల్‌ను మట్టితో నింపుతుండగా సంబంధిత ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఎందుకు పట్టించుకోలేదు, వేల ట్రిప్పుల మొరం తరలిస్తుండగా మైనింగ్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదు, పోలీసులు పట్టించుకోరా అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎఫ్‌టీఎల్‌లో ఉండటంతోనే రిజిస్ట్రేషన్ కాలేదా లేదా దీనికి ఇరిగేషన్ నుంచి ఏమైనా పరిహారం ఇవ్వడం వల్ల ఆపివేశారా అని తేలాల్సి ఉంది.

లీడర్లను వదిలి కూలీల వెంట..

చెరువు మత్తడి ధ్వంసం కేసులో అసలైన లీడర్లను వదిలి కూలీకి పని చేసే వారిని చూపెట్టినట్లు పట్టణ ప్రజలు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. ఈ కేసులో పెండ్యాల లక్ష్మీనారాయణ(చెన్నూర్), భీం మధూకర్ (చెన్నూర్), రసమల్ల శ్రీనివాస్ (చెన్నూర్), గోగుల దానయ్య (మంచిర్యాల)ల ను అరెస్టు చేసిన పోలీసులు చెరువులో వేల ట్రిప్పుల మట్టి పోసి వెంచర్ వేసేందుకు ప్రయత్నిచిన బడా నేతను ఎందుకు వదిలారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. చెరువులో మట్టి పోయడం వల్ల నీరు ఇండ్లలోకి వచ్చిందని ప్రకటిస్తూ మట్టి పోసిన వారిని ఎందుకు వదిలారో తెలియడం లేదు. ముఖ్యులను కాపాడేందుకు లక్షల రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలు సైతం వినబడుతున్నాయి. 

నీరు ఖాళీ అయితే ఎవరికి లాభం?

చెరువులో నీరు ఖాళీ అయితే ఎవరి కి లాభం అనే కోణంలో చూస్తే అసలు దొ ంగలు బయటపడుతారని స్థానికు లు చెబుతున్నారు. చెరువు నుంచి ఇండ్లలోకి నీళ్లు వస్తాయని వార్డు కౌన్సిలర్ భ ర్త మత్తడిని పేల్చేంతే ధైర్యం చేస్తాడా అ ని ప్రశ్నిస్తున్నారు. ఎన్నో సమస్యలు వా రి దృష్టికి వచ్చినా చూసీ చూడనట్టు వ్య వహరించే ప్రజాప్రతినిధులు తన వా ర్డులో కొందరి ఇండ్లలోకి నీరు వస్తుంద ని వేలకు వేలు ఖర్చు పెట్టి ధ్వంసం చేసే ంత సాహసం చేస్తాడా అని స్థానికంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స ంబంధిత శాఖ అధికారులు ఖచ్చితమైన విచారణ జరిపితే అసలు దొంగలు బయటపడుతారని జగమెరిగిన సత్యం. 

మట్టి నింపడంతోనే ఇండ్లలోకి నీరు 

శనిగకుంటలో వేల ట్రిప్పుల మట్టిని నింపిండ్రు. గప్పటి నుంచి వానలు బాగా పడ్డప్పుడల్లా మా ఇండ్లలోకి నీరు వస్తుంది. మునుపు రాకపోతుండే. తుర్క పంతులు పేరిట ఈ భూమి ఉన్నప్పటి నుంచి చూసుకుంట వస్తున్నం. ఎప్పుడు గిట్ల కాలేదు. మొన్నటి మొన్న వచ్చిన వానలకు నీళ్లు ఇండ్లదాక వచ్చినయ్. ఇప్పటికి నీటి తడి ఆరలేదు. మునుపుటి వలె నీళ్లు చెర్లకు పోయేటట్టు చూడుండ్రి. పాముల భయంతో సత్తున్నం.

            బోరె కమల, చెన్నూర్