calender_icon.png 19 April, 2025 | 12:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

30 రోజుల్లో దేశాన్ని వీడండి!

14-04-2025 01:52:27 AM

  1. విమాన ఖర్చులు చాలకపోతే రాయితీలు ఇస్తాం..
  2. దేశాన్ని వీడకపోతే జైలు శిక్ష తప్పదు..
  3. అగ్రరాజ్యం హెచ్చరికలు

వాషింగ్టన్, ఏప్రిల్ 13: ‘అమెరికాలో  30 రోజులకు మించి నివసిస్తున్న విదేశీయులు తప్పనిసరిగా తమ వివరాలను ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేయించుకోండి. లేదంటే అపరాధ రుసుము చెల్లించక తప్పదు. నిబంధనలు పాటించని వారికి జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది. లేదంటే వెంటనే అమెరికాను వీడి వెళ్లిపోండి.

మీకు ఎలాంటి నేర చరిత్ర లేకుంటే మీరు సంపాదించిన సొమ్మును సైతం వెంట తీసుకెళ్లండి. మీరు అమెరికాను వీడేందుకు విమాన ఖర్చులకు డబ్బుల్లేక పోతే మా ప్రభుత్వం రాయితీలు సైతం అందిస్తున్నది’ అని తాజాగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ హెచ్చరికలు జారీ చేసింది.

ఈ హెచ్చరికలు హెచ్1బీ1, విద్యార్థి అనుమతులపై అమెరికాలో ఉండేవారికి వర్తించదని, అనుమ తులు లేకుండా అమెరికాలో ఉంటున్న వారికి మాత్రమేనని స్పష్టం చేసింది.