calender_icon.png 27 April, 2025 | 8:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు నగరాన్ని విడిచి వెళ్లిపోండి

27-04-2025 12:00:51 AM

నలుగురు పాకిస్తాన్ పౌరులకు పోలీసుల ఆదేశం

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): ఈరోజే నగరాన్ని విడిచి వెళ్లిపోవాలని నలుగురు పాకిస్తాన్ పౌరులకు హైదరాబాద్ పోలీసులు శనివారం నోటీసులు ఇచ్చారు. వీరు షార్ట్‌టర్మ్ వీసాలపై నగరంలో ఉన్నట్లుగా గుర్తించారు. కాగా నగరంలో పలు రకాల వీసాలపై దాదాపు 213 మంది పాకిస్తాన్ పౌరులు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నగర పోలీసులు కూడా హైదరాబాదులోని పాకిస్తాన్ పౌరుల వివరాలను సేకరించారు.