calender_icon.png 31 October, 2024 | 8:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లెబనాన్‌ను వీడండి!

02-08-2024 01:35:55 AM

భారతీయులెవరూ ఇక్కడికి రావొద్దు: ఇండియన్ ఎంబసీ 

బీరుట్, ఆగస్టు 1: లెబనాన్ రాజధాని బీరుట్‌లో ఇజ్రాయెల్ దాడులు చేసి హెజబొల్లా మిలిటరీ కమాండర్ ఫాద్ షుక్ హతమార్చిన నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. దీంతో అక్కడి భారత రాయబా ర కార్యాలయం స్పందిస్తూ.. ‘లెబనాన్‌లో ఏ క్షణంలోనైనా ఇక్కడ మళ్లీ దా డులు సంభవించవచ్చు. భారతీయు లు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి. కొత్తగా ఎవరూ లెబనాన్‌కు రావొద్దు’ అని సూచించింది. తప్పనిసరి పరిస్థితుల్లో లెబనాన్‌లో ఉండేవారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.