calender_icon.png 4 April, 2025 | 6:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇల్లు వీడండి చిన్న ఉద్యోగంతోనైనా జీవితం ప్రారంభించండి

24-03-2025 12:00:00 AM

  • జాబ్ మేళా ద్వారా ముందడుగు వేయండి వడగండ్లకు నష్టపోయిన 
  • రైతులను ఆదుకోవాలి మాజీమంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీరావు 

సిద్దిపేట, మార్చి 23 (విజయక్రాంతి): చిన్న ఉద్యోగమని చిలుకను చూడకుండా జాబ్ మేళా ద్వారా పొందిన ఉద్యోగం కోసం ఇల్లు వదలాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు సూచించారు. సిద్దిపేటలోని విపంచి కళానిలయంలో ఏర్పాటు చేసిన మహిళా జాబ్ మేళా లో ఆయన పాల్గొని మాట్లాడారు నీవు నీ కాళ్ళ మీద నిలబడ్డప్పుడు మాత్రమే ప్రశ్నించగలుగుతావు స్వతంత్రంగా బ్రతకగలుగుతామంటూ వివరించారు జాబ్ మేళా ద్వారా కొత్త జీవితాన్ని ప్రారంభించి ఆర్థికంగా ఎదగాలని సూచించారు.

అనంతరం సిద్దిపేట ఎల్లమ్మ ఆలయం 49వ ఉత్సవాలలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. సిద్దిపేట రూరల్ మండలంలోని దోర్నాల గ్రామంలో గల అమరవీరుల స్తూపం పునర్నిర్మాణానికి గ్రామం స్వాగత తోరణ నిర్మాణానికి భూమి పూజ చేశారు అనంతరం ఇంద్ర గూడెం రాఘవపూర్ గ్రామాలలో సాగుతున్న బీరప్ప ఉత్సవాలలో పాల్గొని పూజలు చేశారు నారాయణరావుపేట మండలంలో శనివారం రాత్రి కురిసిన వడగండ్ల వర్షానికి లక్ష్మిదేవిపల్లి గ్రామంలో నష్ట పోయిన వరి పంటలను పరిశీలించిన, రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ వడగండ్ల వర్షానికి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. వానాకాలం రైతు బంధు రూ.15వేలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బిఆర్‌ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో రూపొందించిన ఆన్లైన్ బెట్టింగ్ ప్లెక్సీ ని హరీశ్ రావు విడుదల చేశారు.

లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన లత రమేష్ దంపతుల కుమార్తెకు గుండె ఆపరేషన్ కు రూ.8లక్షల ఎల్‌ఓసి అందజేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ టిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్ష నిర్వహించిందన్నారు నియామక పత్రాలు మాత్రమే అందించి ఉద్యోగాలు ఇచ్చామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు.

వడగండ్ల వర్షానికి నష్టపోయిన రైతులకు తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించి ప్రతి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు ఎకరానికి ఆరు క్వింటల్లా కందులు కొనుగోలు చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు నిజామాబాద్ కామారెడ్డి సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా జొన్నలు సాగు చేస్తున్నారని జొన్నలు కందులు మొక్కజొన్నలు వద్ద తిరుగుడు ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

కాంగ్రెస్ ప్రభుత్వం కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను రైతులను మోసం చేస్తుందని ఈ విషయాన్ని గమనించాలని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ మోటార్లు కాలిపోతున్నాయని విమర్శించారు.