- ఉన్నా.. ఫిర్యాదులు వస్తేనే స్పందిస్తాం
- పాండవుల చెరువు భూముల్లో నిర్మాణాల్లేవ్..
- ఆక్రమణలపై గజ్వేల్ అధికారుల స్పందనలు
- ఆశ్యర్యానికి గురవుతున్న స్థానిక ప్రజలు
గజ్వేల్, ఆగస్టు 27: సిద్దిపేట జిల్లా గజ్వేల్ పాండవుల చెరువుతో పాటు మున్సిపాలిటీ పరిధిలోని చెరువులపై విజయక్రాంతి వరుస కథనాలు ప్రచురించడంతో ఇరిగేషన్, రెవె న్యూ, మున్సిపల్ శాఖల అధికారులు వాస్తవ పరిస్థితులకు భిన్నంగా స్పందించారు. పాండవుల చెరువుతో పాటు మున్సిపాలిటీ పరిధి లోని చెరువులు, నాలాలు కబ్జాకు గురైనా, ఎఫ్‌టీఎల్‌లో నిర్మాణాలు ప్రత్యక్షంగా కనిపిస్తున్నా ఫిర్యాదులు వస్తేనే స్పందిస్తామని మున్సిపల్ కమిషనర్ వెల్లడించడం గమనార్హం. గత ఏడాది నుంచి గజ్వేల్ పరిధిలోని అక్రమ కట్టడాల గురించి ఎలాంటి ఫిర్యాదులు అందలేదని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సి పాలిటీ టీపీవో చెప్పారు. పాండవుల చెరువు ప్రాంతంలో అక్రమ నిర్మాణాలేవీ గుర్తించలేదని చెప్పడం ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.
ప్రభుత్వ శాఖల సమన్వయ లోపం..
చెరువుల ఆక్రమణపై ప్రభుత్వ శాఖల అధికారులు స్పందించిన తీరు స్థానికులను విస్మయానికి గురిచేస్తున్నది. ఆయా శాఖల అధికారుల సమన్వయ లోపమే రియల్టర్ల ఆక్రమణకు అవకాశం కల్పిస్తున్నట్లు స్పష్టమవుతు న్నది. దశాబ్దాలుగా చెరువుల ఎఫ్‌టీఎల్ హద్దులు గుర్తించకపోవడంతో పట్టాదారులు, కొనుగోలు దారులు సైతం ఆయా భూము ల్లో నిర్మాణాలు చేపట్టారు. పాండవుల చెరువును మినీట్యాంక్‌బండ్‌గా ఏర్పా టు చేసే క్ర మంలో ఇరిగేషన్ ఉన్నతాధికారులతో గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పాండవుల చెరువుల భూములను గుర్తిం చి ఎఫ్‌టీఎల్ హద్దులు ఏర్పాటు చేయడంతో పాటు చెరువు మ్యాప్‌నుగా తయారు చేయించారు. కానీ దశాబ్దాల క్రితం ఉన్న పాండవుల చెరు వు విస్తీర్ణం ఇప్పడు లేదు. కొన్ని సంవత్సరాల క్రితమే ఎఫ్‌టీఎల్ పరిధిలో మున్సిపల్ భవన నిర్మాణం చేపట్టేందు కు అనుమతులివ్వాలని అప్పటి మంత్రి హరీశ్‌రావు ఇరిగేషన్ అధికారులకు సూచించినా అనుమతించలేదు. కానీ ఎఫ్‌టీఎల్ భూము ల్లో ప్రస్తుతం ఇళ్ల నిర్మాణాలు, పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. అవి అధికారులకు ఎందు కు కనబడడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
అనుమతులిచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలి
హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరంలో చెరువులు, ప్రభుత్వ స్థలాలలో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నర్స్ అధ్యక్షుడు ఎం పద్మనాభరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. హైడ్రా కూల్చివేస్తున్న అక్రమ నిర్మాణాల్లో బాధితులుగా మారుతున్న వారికి బిల్డర్ల నుంచి ప్రభుత్వం నష్ట పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు హైడ్రాకు చట్టబ ద్ధత కల్పించాలన్నారు. అక్ర మ కట్టడాలను కూల్చినప్పు డు సంబంధిత బిల్డర్ల నుంచి బాధితులుగా మారుతున్న పేదలకు ప్రభుత్వం నష్టపరిహారం ఇప్పించాలని కోరారు. బిల్డర్లతో కుమ్మ క్కై అనుమతులు ఇచ్చిన రిజిస్ట్రేషన్, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ అధికారులపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఏడాది క్రితమే తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశాం
పాండవుల చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలను మేము గుర్తించాం. ఎర్రకుంట నుంచి పాండవుల చెరువుకు ఉన్న నాలా భూముల్లో పెట్రోల్ బంక్, ఇతర నిర్మాణాలు వెలిశాయి. అక్రమ నిర్మాణాలను కూల్చివే యాలని ఏడాది క్రితమే తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశాం. ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు, గజ్వేల్ ఆర్డీవో చెరువుల కు ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లను గుర్తించి హద్దులు పెట్టాలని రెండు, మూడు నెల ల క్రితమే ఆదేశాలిచ్చారు. కానీ రెవెన్యూ అధికారులు బిజీగా ఉండటంతో మాకు అవకాశం రాలేదు. త్వరలో వారితో కలిసి హద్దులను ఏర్పాటు చేస్తాం.
మోతియా,
డీఈఈ, ఇరిగేషన్, గజ్వేల్
ఆక్రమణలు, నిర్మాణాలు మా దృష్టికి రాలేదు
చెరువుల ఎఫ్‌టీఎల్ భూముల ఆక్రమణలు, నిర్మాణాలు ఇప్పటి వరకు మా దృష్టికీ రాలేదు. వస్తే వెంటనే స్పందించి చర్యలు చేపడతాం. ఇరిగేషన్ అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. చెరువులు, కుంటలు పూర్తిగా ఇరిగేషన్ పరిధిలోనివి. అక్రమ నిర్మాణాలు జరిగినట్లు మా దృష్టికి తీసుకువస్తే వెంటనే స్పందించి మావంతు సహకారం అందిస్తాం.
శ్రావణ్, తహసీల్దార్, గజ్వేల్