07-03-2025 12:00:00 AM
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి, మార్చి 6 (విజయ క్రాంతి):డ్రైవింగ్ నేర్చుకోవడంతో మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు తెలిపారు. గురువారం సంగారెడ్డి లో రెండవ విడత మహిళలకు డ్రైవింగ్ శిక్షణను ప్రారంభించి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడారు. మహిళ డ్రైవర్లకు మంచి భవిష్యత్తు ఉందన్నారు. డ్రైవింగ్ శిక్షణ నేర్చుకున్న మహిళలకు స్వయం ఉపాధి పథకాల ద్వారా రుణాలు మంజూరు చేస్తామని తెలిపారు. మహిళలు క్యాబ్ డ్రైవరులకు స్వయం ఉపాధి లభిస్తుందన్నారు. మహిళలు డ్రైవింగ్ నేర్చుకుంటే వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు.
సంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ మెట్రో నగరానికి హైటెక్ సిటీ ప్రాంతానికి దగ్గరగా ఉండటం వల్ల మహిళా డ్రైవర్లకు మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. మహిళలు డ్రైవింగ్ శిక్షణలో నైపుణ్యం సాధించడం వల్ల ప్రతినెల రూ. 15 నుండి రూ. 20వేల వరకు ఆదాయం పొందే వెసులుబాటు కలుగుతుందన్నారు. డ్రైవింగ్ శిక్షణలో మంచి నైపుణ్యం సాధించాలని మహిళకు సూచించారు మహిళ లు క్యాబ్ డ్రైవర్లుగా ఉంటే అందులో ప్రయాణించే మహిళలకు భద్రత ఉంటుందన్నారు.
నైపుణ్యం తమ భర్త, కుమారుడు వాహనం నడిపిస్తే రాదని , ప్రయాణించే మహిళలు స్టీరింగ్ పట్టడం వల్ల మహిళల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అన్నారు. క్యాబ్ డ్రైవర్లకు డిమాండ్ ఉందన్నారు. సంగారెడ్డి జిల్లా హైదరాబాద్ మెట్రో నగరానికి హైటెక్ సిటీ ప్రాంతానికి దగ్గరగా ఉండటం వల్ల మహిళా క్యాబ్ డ్రైవర్లకు మంచి డిమాండ్ ఉందన్నారు. డ్రైవింగ్ శిక్షణలో నైపుణ్యం సాధించిన వారికి వివిధ క్యాబ్ సర్వీసెస్ సంస్థలతో , ఇతర ప్రైవేట్ సంస్థలు, ఫైనాన్షియల్ డిస్టిక్ లోని పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థలతో మాట్లాడి వారికి అందులో ఉపాధి లభించేలా చూస్తామని తెలిపారు.
మహిళా క్యాబ్ డ్రైవర్ స్వయం ఉపాధి పొందేలా జిల్లా యంత్రాంగం కృషి చేయనున్నట్లు తెలిపారు. వివిధ స్వయం ఉపాధి పథకాల ద్వారా శిక్షణ పొందిన మహిళ డ్రైవర్లకు ఇప్పించేలా కృషిచేయునట్లు కలెక్టర్ తెలిపారు. ఈ శిక్షలను మహిళలు సద్వినియోగం చేసుకొని తమ కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ మనోజ్, పీడీ,ఆర్ డి ఓ జ్యోతి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు,అదనపు డి ఆర్ డి ఓ లు, డిపిఎంలు, ఎస్ హెచ్ జి గ్రూప్ సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు, సిబ్బంది పాల్గొన్నారు.